గాలీ, వాన భీభత్సం.. నేలకొరిగిన ఏండ్లనాటి మహావృక్షం

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మాసబ్ ట్యాంక్, నార్సింగ్, ఉప్పల్, ఎల్బీనగర్, హాబ్సిగూడ, తార్నాకలో ప్రారంభమైన ఈదురుగాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కరుస్తూనే ఉంది. ఈ క్రమంలో టోలిచౌకీలోని గోల్కొండ ఎండీ లైన్స్‌లో‌ ఉన్న 200 ఏళ్ల క్రితం నాటి పురాతన మహావృక్షం ఈదురుగాలులకు నేలకొరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తలకు తీవ్రగాయాలయ్యాయి.  చెట్టు కింద పార్క్ చేసిన నాలుగు బైకులు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి.

Spread the love