బాలికపై సామూహిక లైంగికదాడి

– జువైనైల్‌ హోంకు నిందితులు
నవతెలంగాణ-ఘట్కేసర్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. గురువారం ఓ బాలికపై ఇద్దరు మైనర్‌లు లైంగికదాడి చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్‌లో పనిచేస్తున్న ఓ బాలికను అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ బాలుడు ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. దాంతో ఆమెను తీసుకెళ్లి ఘట్కేసర్‌లోని స్నేహితుని ఇంటిపైన ఇద్దరూ కలిసి బాలికపై లైంగికదాడి చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు బాలురులను అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనైల్‌ హౌమ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Spread the love