జీవో 142 రద్దు చేయాలి

Geo 142 should be cancelled– రాష్ట్ర అధికారులకు సమ్మె నోటీసులు అందజేత
– డాక్టర్లు, పారామెడికల్‌ ఉద్యోగుల యూనియన్స్‌, అసోసియేషన్స్‌ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలోని జీవో 142 రద్దు చేయాలని డాక్టర్లు, పారామెడికల్‌ ఉద్యోగుల యూనియన్స్‌ అసోసియేషన్స్‌ల రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం కమిటీ నాయకులు ఆధ్వర్యంలో కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ఇతర రాష్ట్ర అధికారులకు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా జీవో 142 రద్దు పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నాయకులు మాట్లాడుతూ జీవో 142 వైద్యారోగ్యరంగానికే గొడ్డలిపెట్టులాంటిదని విమర్శించారు. మానవ వనరుల హేతుబద్ధీకరణ అనేది జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించడం కోసం చేయాలని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సమాచారాన్ని,సలహాలు సూచనలు తీసుకో కుండా తమ ఇష్టానుసారంగా ఈ జీవోను విడుదల చేసిందని విమర్శిం చారు. ఈ జీవో రద్దయ్యేవరకు 142 జీవో రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. అక్టోబర్‌ 5లోపు జీవో రద్దు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో జీవో 142 రద్దు పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కే.సాయిరెడ్డి, కె.యాదనాయక్‌, ఎన్‌ శ్యాంసుందర్‌, బి వెంకటేశ్వర్‌ రెడ్డి, రాబర్ట్‌ బ్రూస్‌, జి రాజశేఖర్‌, ఏ.అరుణ, ఆప్తాబ్‌ అహ్మద్‌ ఖాన్‌, జి.క్రిష్ణ, భూషణ్‌, గుండయ్య, విజయ భాస్కర్‌, చక్రధర్‌, శివానంద్‌, రామేశ్వరి, కవిత పాల్గొన్నారు.

Spread the love