మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో లే అవుట్ ప్లాట్ లు పెట్టిన కొత్త కాలనిలో విధి దీపాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సర్పంచ్ సక్కారం అశోక్ విద్యుత్ అధికారులను కోరారు. కొత్త కాలనీలో వీధి దీపాల కోసం స్తంభాలు వేసి, విద్యుత్ తీగలు అమర్చి 18 నెలలు గడుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుస్తంభాలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంవత్సరం నుండి విధి దీపాల లైన్ లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని, కాలని వాసులతో పాటు తను సర్పంచ్ గా ఎన్ని సార్లు విద్యుత్ అధికారులకు దరఖాస్తులు ఇచ్చిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.ఎందుకు స్పందించడం లేదని విద్యుత్ అధికారులను అడిగిన వివరణ ఇవ్వడం లేదని తెలిపారు. చీకట్లో ఉన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి కొత్త కాలనీవాసులకు వీరు దీపాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇందుకు ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని సర్పంచ్ సక్కారం అశోక్ కోరారు.