
నవతెలంగాణ – భువనగిరి రూరల్
జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఆలింకో కంపెనీ వారి ఆధ్వర్యములో యాదాద్రి భువనగిరి జిల్లాలో సామాజిక అధికారిత శిబిరమును నిర్వహించారు . ఈ శిబిరములో 2022లో ఆలింకో వారిచే నిర్వహించబడిన క్యాంప్ నందు వివిధ రకముల సహాయ ఉపకరణములకు ఎంపిక చేయబడిన దివ్యాంగులకు సహాయ ఉపకరణము లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో మొదటగా జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ద్వారా 603సహాయ ఉపకరణాలను అందించినందుకు హర్షం వ్యక్తం చేసినారు. జిల్లాలో వికలాంగులకు ఎన్నో పథకాలు, అందిస్తున్నామని, తెలంగాణాలోనే దివ్యాంగులకు అత్యధికముగా పెన్షన్ లను ఇవ్వడం జరుగుతొందని, వికలాంగులకు ఆర్థిక పునరావాసం పథకం కింద లోన్ లను కూడా ఇవ్వడం జరుగుతొందని అన్నారు. అలింకో ప్రతినిధి, ఆసిస్టంట్ సెక్షన్ ఆఫీసర్ నీతూ దూబే మాట్లాడుతూ ఈ కార్యక్రమమును నిర్వహించుటలో సహకరించిన జిల్లా మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కు అభినందనలు తెలియజేసినారు. భువనగిరి ఎంపీపి నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం ద్వారా అందించబడే అన్నీ సహాయ సహకారాలు పొంది అభివృద్ధిలోకి రావాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా సకలాంగులతో సమానంగా గౌరవించాలని కోరారు . బొమ్మలరామారం ఎంపీపి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి స్కీములను, తక్కువ ఆదాయం ఉన్న దివ్యాంగులకు సహాయ సహకారాలను అందించాలని, విజయాలను సాధించిన దివ్యాంగులకు సన్మానాలను చేయాలని , వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి ముందుకు నడిపించాలని అన్నారు. 5వస్థాయి సంఘ కమిటీ ఛైర్మన్ తోటకూరి అనురాధ మాట్లాడుతూ మీకు అందుబాటులో ఉన్నవారికి ఖచ్చితంగా పరికరాలను అందిస్తామని , లోన్ లు మరియు ప్రభుత్వం నుండి ఏ సహాయం అయినా మీకు అందుతుందని అన్నారు. ఆలింకో సంస్థ ద్వారా చదువుకోని దివ్యాంగులకు మరియు చదువుకోసం బయటికి వెళ్ళే దివ్యాంగులకు ప్రభుత్వము శాఖా పరముగా సహాయమును అందించాలని అన్నారు. భువనగిరి జెడ్పిటిసి బీరు మల్లయ్య మాట్లాడుతూ పరికరాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేద వికలాంగుల ప్రజలు వారికి కావలసిన ఉపకరణాలను కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ పొంది తమ అవసరాలను తీర్చుకోవాలని తెలుపుతూ ఇట్టి సహాయ కార్యక్రమాన్ని నిర్వహించుచున్న ప్రభుత్వము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆలింకో సంస్థ పిఓ రవిశంకర్ మాట్లాడుతూ ఏ డి ఐ పి స్కీమ్ ద్వారా దివ్యాంగులకు, ఆర్ వి వై స్కీమ్ ద్వారా వృద్ధులకు సహాయ ఉపకరణాలను అందించడం జరుతున్నదని, భారత ప్రభుత్వము వారు అందించుచున్న ఈ ఉపకరణాలను పొంది దివ్యాంగులు వారి అవసరాలకు ఉపయోగించు కోవాలని కోరారు. దివ్యాంగుల కమిటీ ప్రసిడెంట్ నర్సింహులు, మెంబర్లు ప్రకాష్, అశోక్ లు మాట్లాడుతూ ఆలింకో సంస్థ నుండి దివ్యాంగులకు ఈ అవకాశాలను కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేసినారు. మరియు గ్రామీణ మండల స్థాయిలో అధికారంలో ఉన్న ప్రభుత్వ సభ్యులు , పార్లమెంట్,జడ్పీటీసీ , అసెంబ్లీ వారు ఎవరైనా దివ్యాంగులకు సహాయం చేయాలని, కళ్యాణ లక్ష్మి ద్వారా ఎక్కువ అమౌంట్ ఇప్పించాలని కోరినారు . జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రభుత్వం వారు, ఆలింకో వారు అందిస్తున్నసహాయ ఉపకరణాలను పొంది దివ్యాంగులు తమ అవసరాలను తీర్చుకొని అభివృద్ధిలోకి రావాలని, మీకు ఇచ్చిన పరికరాలను, బ్యాంక్ లోనులను సద్వినియోగ పరచుకోవాలని, మీ ఇతర డిమాండ్లను గురించి ప్రభుత్వం వారికి తెలియజేస్తామనారు. ఈ కార్యక్రమములో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ జి శశికళ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.