నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన రైతుభరోసాపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణమాఫీపై అధికారుల నివేదిక అనంతరం ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.