షూగర్ ఉన్న వారికి శుభవార్త .. ఈ జెల్ వాడితే చాలు..

నవతెలంగాణ న్యూఢిల్లీ: చక్కెర వ్యాధి ఉంటే గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యకు ‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌’ (ఎన్‌యూఎస్‌) శాస్ర్తవేత్తలు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. డయాబెటిక్‌ గాయాలకు  సరికొత్త చికిత్సా విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. డయాబెటిక్‌ గాయాలను మూడు రెట్లు వేగంగా మాన్పే ‘మ్యాగ్నెటిక్‌ జెల్‌’ను తయారుచేశారు. గాయమైన చోట హైడ్రోజెల్‌ పూతవున్న బ్యాండెజ్‌ వేశాక, ఒక వైర్‌లెస్‌ మాగ్నెటిక్‌ పరికరంతో దెబ్బతిన్న కణజాలాన్ని ఉత్తేజితం చేస్తామని శాస్ర్తవేత్తలు తెలిపారు. దీంతో దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. చికిత్సా సమయం ఒకటి నుంచి రెండు గంటలు ఉంటుందని, మూడు రెట్లు వేగంగా గాయం నయమవుతుందని వారు వెల్లడించారు.

Spread the love