ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

నవతెలంగాణ – వరంగల్: డ్రంక్ డ్రైవ్ ప్రమాదకరమని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరికి మాత్రం అస్సలు పట్టడం లేదు. తాగేసి డ్రైవింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నేటి తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి.. రాంగ్ రూట్‌లో ఆటోను నడిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో లారీని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Spread the love