నాగారం ఇంటిపన్ను గోస కేటీఆర్ పరిష్కరించాలి.. 

– మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా
నవతెలంగాణ- కంటేశ్వర్
నాగారం ఇంటి పన్ను గోస కేటీఆర్ పరిష్కరించాలి అని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా మంగళవారం నిర్వహించారు. నేడు నిజామాబాద్ నగర పర్యటన చేయనున్న మున్సిపల్ , ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్  నగరంలోని ఆక్యూపైర్ టాక్సీ, రద్దు చేయబడిన సెల్ఫ్ అసెస్మెంట్ టాక్సీ బాధితుల గోస విని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ నాగారం ప్రాంతంలో 300 క్వార్టర్స్ 80 క్వాటర్స్, 50 క్వార్టర్స్ పాత నాగారం ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని ఇంటి పన్ను చెల్లిస్తున్నారు, మ్యానువల్ టాక్స్ వసూలు చేసినప్పుడు పేర్లతో రసీదులు ఇచ్చినప్పటికీ, ఆన్లైన్ సిస్టం వచ్చిన తర్వాత ఆక్యుపేర్ క్రింద మార్చివేసి మున్సిపల్ అధికారులు తీరని అన్యాయం చేశారని అన్నారు, ఆకూపైర్ స్థానంలో, పేర్లతో అసెస్మెంట్ ఇంటి పన్ను వసూలు చేయాలని 10 ఏళ్లుగా అనేకమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ టాక్సీ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో 100 గజాల లోపు అనేకమంది నిరుపేదలు ఇంటి పన్ను చెల్లించి, సెల్ఫ్ అసెస్మెంట్ పొందినప్పటికీ అనేక కారణాలు చెబుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రద్దు చేశారని అన్నారు, ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలివేసి నిరుపేదలను శిక్షించడం వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రేపు జరగబోయే బహిరంగ సభలో సంబంధిత మంత్రిగారు నిజామాబాద్ నగర ప్రజల ఆకూపైర్ టాక్సీ సమస్యలను, సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ పునరుద్ధరణ అంశాలపై స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బెజగం సుజాత, సీఐటీయూ నగర కో కన్వీనర్ కటారి రాములు, వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ధ్యారంగుల కృష్ణ, 300 క్వార్టర్స్ వాసులు రాజమణి స్వరూప, పుష్ప, హేమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love