
– గోషామహల్ లో మారుతున్న రాజకీయ సమీకరణలు…
– ఆందోళనలో ఆశావహులు..
– ఉద్యమకారుడు మహేందర్ కు అంటూ టాక్..
నవతెలంగాణ – ధూల్ పేట్
బీఆర్ఎస్ మొదటి విడత అభ్యర్థుల ప్రకటన తో గోషామహల్ ఆశావహులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. గోషామహల్ లో తీరు మారుతుంది. తెలుగు భాషా మాట్లాడే వారికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పించిన ఓ సర్వేలో వెల్లడి అయ్యిందని స్థానిక నాయకులు, సోషల్ మీడియా ప్రచారం ఆశావాహులు గుండెల్లో రైలు పరుగెత్తిస్తోంది.
మారుతున్న సమీకరణాలు..
గోషామహల్ నియోజకవర్గం లో రాజకీయ
సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం సుమారు డజనుకు పైగా బిఆర్ఎస్ నేతలు పోటీ పడుతుండటంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో సీఎం కేసీఆర్ గోషామహల్ తో సహా మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను పెండింగ్లో పెట్టి ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయనే విషయమై సీఎం కేసీఆర్ తాజాగా సర్వేకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గోషామహల్ లో సర్వే నిర్వహించిన ప్రైవేట్ సంస్థ నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించింది. ఈ సర్వే నివేదిక అందించిన తాజా సమాచారంతో సీఎం కేసీఆర్ గోషామహల్ నియోజకవర్గం
అభ్యర్థిత్వాన్ని ఈనెల రెండవ తేదీన ఖరారు. చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. సర్వే నివేదిక సమాచారం ప్రకారం పార్టీ టికెట్ను ఆశిస్తున్న డజనుకు పైగా నేతల పేర్లను వడపోసిన తర్వాత నందకిషోర్ వ్యాస్ తోపాటు అనూహ్యంగా ఆర్వి మహేందర్ కుమార్ పేరు తెరపైకి రావడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
– తెలుగు మాట్లాడే వారికే..
బీజేపీ కంచు కోట అయిన గోషామహల్ నియోజక వర్గంలో గత రెండు మార్లు వారికే ఇచ్చిన ఓటమి పాలయ్యమని ఈ సారి తెలుగు వారికే ఇవ్వాలని టాక్. సర్వే నివేదికలో నందకిషోర్ వ్యాస్, ప్రేమ్ సింగ్ రాథోడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్ ల పేర్లలో ఒకరిని ఎంపిక చేయాలని చేసిన సర్వేలో అనూహ్యంగా తెలుగు మాట్లాడే వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు వెళ్లడైంది. దీంతోపాటు తెలుగు భాష మాట్లాడే వారిలో ఆర్వి మహేందర్ కుమార్ తో పాటు గడ్డం అసిష్ కుమార్ యాదవులలో ఒకరికి పార్టీ టికెట్ కేటాయించాలని కోరినట్లు సర్వే నివేదిక లో పేర్కొన్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం నుండి విశ్వసనీయ సమాచారం అందిందనే ప్రచారం నియోజక వర్గంలో చర్చలు కొనసాగుతున్నాయి. తాజా రాజకీయ సమీకరణల్లో హిందీ భాష మాట్లాడే వారి నుండి నందకిషోర్ వ్యాస్ ముందు వరుసలో ఉండగా, తెలుగు భాష మాట్లాడే వారి నుండి ఆర్వి మహేందర్ కుమార్ ముందున్నారు. ప్రేమ్ సింగ్ రాథోడ్, గడ్డం ఆశీస్సు యాదవుల పేర్లు కూడా తర్వాతి క్రమంలో ఉన్నాయనే నాయకులు, కార్యకర్తలు గుసగుస లాడటం విశేషం. కాగా హిందీ, తెలుగు భాషల్లో నుండి ముందు వరసలో ఉన్న నందకిషోర్ వ్యాస్ ఆర్ వి మహేందర్ కుమార్ల మధ్య తాజాగా పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురిలో ఒకరిని ఎంపిక చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
– ఉద్యమకారుడు మహేందర్ కు ..
ఉద్యమ కారుడు అర్వి మహేందర్ కు ఇవ్వాలని ఉద్యమకారులు, కార్యకర్తలు కోరుతున్నారు. నియోజక వర్గంలో నాడు కాంగ్రెస్ మంత్రి ముఖేష్ గౌడ్ ఎదిరించి నియోజక వర్గంలో పార్టీ జెండా తో ఎదురు పోరాడిన వ్యక్తి అని మాట్లాడుతున్నారు. నాటి నుండి పార్టీ అధిష్టానానికి కట్టుబడి నియోజక వర్గంలో పార్టీ బలోపేతం చేస్తూ ఉద్యమం కారులకు, ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిచేసుకు కృషి చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల్లో పార్టీ అదేసానుసారంగా నియోజక వర్గంలో ఎవరిని నిలబెట్టిన వారికి సంపూర్ణ మద్దతు అందిస్తూ పార్టీ కోసం పని చేసిన వ్యక్తి అర్వి మహేందర్ కుమార్ అని అయకే టికెట్ ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటిస్తారని బాహాటంగా మాట్లాడుకున్నారు. ఎవరికి వస్తుందో, అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందో చుడాలి..