రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతర కృషి

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు మంగళవారం మండలంలోని పోలెపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతుల సౌకర్యార్థం విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందుల యాకయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love