నవతెలంగాణ – ఎల్బీనగర్
మహేశ్వరం నియోజవర్గం పరిధిలోని సరూర్నగర్ డివిజన్ అశోక ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ దోపిడీ పాలనతో విసిగిపోయారని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్, యువ వికాసం హామీలను నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి మన గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి, టీపీసీసీ నిజాముద్దీన్, బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, డివిజన్ బోయిన్ శంకర్ యాదవ్, యువజన ధనరాజ్ గౌడ్, మహిళ అధ్యక్షురాలు అరుణ, బీర బాలకష్ణ, చిక్కుల శివ ప్రసాద్, నందీగామా నర్సింహ, గంగం కిశోర్ కుమార్, జంగారెడ్డి, ఇమ్రాన్, జావిద్, రమేష్ గౌడ్, మల్లేష్, పులి గౌడ్, సుధాకర్ గౌడ్, షఫీ, మణికంఠ భాస్కర్ నాగరాజ్, జనార్దన్ గౌడ్ సంగీత, శైలజ, సుశీల మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జీ.రంజిత్ రెడ్డిని గెలిపిస్తాయని టీపీసీసీ కార్యదర్శి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎల్మేటీ అమరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డిలు ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ ఎస్ వై ఆర్ పంక్షన్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బోయపల్లి గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ నియోజకవర్గం ఇంచార్జి నిజాముద్దీన్, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, సీనియర్ నాయకులు బంగారు సత్యనారాయణ, నవారు మల్లారెడ్డి, బాల్ లింగని జంగయ్య, రాఘవేందర్ రెడ్డి, గట్టు బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.