మండలిని సందర్శించిన సర్కారు బడి పిల్లలు

Government school children visited the council– స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శనివారం శాసన మండలిని సందర్శించారు. ఎమ్మెల్సీలు కవిత, వాణిదేవి వారికి స్వాగతం పలికారు. మండలి పనితీరు, సభా కార్యకలాపాలు జరిగే పద్ధతి గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆయా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అందరూ కలిసి చైర్మెన్‌ ఛాంబర్‌లో ఫొటో దిగారు. విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై వారికి ఆసక్తి పెరుగుతుందని కవిత వ్యాఖ్యానించారు.

Spread the love