నిజామాబాద్‌ అభివృద్ధి కార్యక్రమాలపై

– ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కల్వకుంట్ల కవిత భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిజామాబాద్‌లోని ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్సీ కవిత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గ పెద్దలలో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. బోధన్‌ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో సమావేశమయ్యారు. అనంతరం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో మర్యాద పూర్వకంగా సమావేశమైన కవిత, మంత్రి కేటీఆర్‌ నిజామాబాద్‌ పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు షకీల్‌, గణేష్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పుట్ట మధు కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
నిజామాబాద్‌ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నిజామాబాద్‌ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ప్రతినిధులు ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. వారి వినతి పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.

Spread the love