బిల్‌ కలెక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

– మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-కీసర
మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న బిల్‌ కలెక్టర ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బిల్‌ కలెక్టర్లు పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు, నగరంలోని సీడీఎంఏ కార్యాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం తమను అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించిందని, దీంతో తమ వేతనంలో పెద్ద ఎత్తున కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం దష్టికి తీసుకెళ్లి తమ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్‌ కలెక్టర్లు బాబు, సబిత, భిక్షపతి, రమేష్‌, ధర్మారెడ్డి, లక్ష్మన్‌, సాయికష్ణ, దుర్గేష్‌, మహేష్‌, శ్రీధర్‌, మహేష్‌ ప్రసాద్‌, అనీల్‌, పాల్గొన్నారు.

Spread the love