ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ మనోహరాబాద్
మహిళా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలను అందజేసి వాటితో చిరు వ్యాపారాలను చేసి మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్టు మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలంలోని కాలాకల్ గ్రామంలో మహిళా సం ఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వము రుణాల ద్వారా లేదా ఎన్నార్ ల్యం నిధుల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ద్వారా రెండు లక్షల రూపాయల నిధులతో శివం సంఘం లోని కొత్తూరి లహరి ఐస్ క్రీమ్ పార్లర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, కాలకల్ ఎంపీటీసీ నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్‌ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఆదేశాల మేరకు మనోహరా బాద్ మండలానికి 14 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు అయినట్టు తెలిపారు. అందులో 7 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని ఒక్కొక్క యూనిట్‌ని బట్టి లక్ష రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు సుమారుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మధ్య లోన్లు కూడా ఇవ్వడం జరిగిందని, ఇవి పూర్తిగా రిపేయిమేంట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షకు సుమారుగా రూ.35 వేల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ భాగ్య, ఐకెపి ఎపిఎం పెంటా గౌడ్ అసిస్టెంట్ మేనేజర్ నరసింహారెడ్డి గ్రామ సంఘం లీడర్లు సంఘాల సభ్యులు సీసీ కష్ణవేణి వివోఏ కల్పన పాల్గొన్నారు.