పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి

నవతెలంగాణ -జమ్మికుంట
జమ్మికుంట పట్టణం,  మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో ముదిరాజ్  బెస్త సంఘ భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన గీత కార్మిక సంక్షేమ సంఘం కొరకు భూమి పూజ చేశారు . మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో రజక కులస్తుల కొరకు అత్యాధునిక దోబీ ఘాట్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించి ,రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా మనం ముందుకు పోవాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఆశీస్సులతో మీ ఆశీర్వాదం తీసుకుంటూ మీ ముందుకు వచ్చానని ,ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ఎమ్మెల్సీఅన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న కోటి , కౌన్సిలర్లు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామంలో అంబేద్కర్ కమిటీ హాల్ ను గురువారం ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ రావులస్వరూప నర్సింగులు, ఎంపీటీసీ తోట కవిత లక్ష్మణ్ సింగిల్ విండో అధ్యక్షులు పొలసాని వెంకటేశ్వరరావు నాయకులు బల్మూరి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love