
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని గంగాధర సింగిల్ విండో ఛైర్మన్ దూలం బాలగౌడ్, కొండగట్టు ఆలయ కమిటి మెంబర్ పుల్కం నర్సయ్య అన్నారు. గంగాధర మండలం కొండాయపల్లి గ్రామంలో విండో పక్షాన ఏర్పాటు చేసే రైస్ మిల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ రైస్ మిల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాస్తానని హామీనిచ్చారని అన్నారు. విండో తరపున కొండాయపల్లి జీపీ పరిధిలో రైస్ మిల్ నిర్మాణాన్ని చేపట్టడానికి అవసరమైన కసరత్తు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతుల సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం ర్యాలపల్లి గ్రామానికి చెందిన పిట్టల రాములు మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఆముదాల రమణారెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.