కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాలు..

– పొదిళ్ళ చిట్టిబాబు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

నవతెలంగాణ -గోవిందరావుపేట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని సిపిఐ ములుగు జిల్లా కమిటీ సభ్యులు పొదిల చిట్టిబాబు అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె రెండవ రోజు సిపిఐఎం పార్టీ తరఫున చిట్టిబాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కనీస వేతన చట్టాన్ని అమలు పరచకుండా, గతంలో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు లో భాగంగా పంచాయతీ కార్మికులను సన్మానించి ప్రభుత్వం వారి జీతభత్యాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికులకు గుర్తింపు ఇవ్వకపోవడం కార్మికుల పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల సమస్యలను గుర్తించి సర్వీస్ ప్రకారం రెగ్యులర్ చేయడమే కాకుండా కనీస వేతన చట్టాన్ని అమలు పరుస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు గుండు రామస్వామి సత్యనారాయణ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love