రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Government's mission is farmer's welfare– కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

నవతెలంగాణ – మల్హర్ రావు
రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తాడిచెర్ల, పెద్దతూoడ్ల గ్రామాలల్లో పీఏసీఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి,ఆయన మాట్లాడారు రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,320 ఇస్తుందని,అదేవిధంగా, సాధారణ రకానికి రూ.2,300 ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, క్వింటా సన్న ధాన్యానికి అదనంగా మరో రూ.500 బోనస్ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,పిఏసిఎస్ సిఈఓ సంతోష్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు రాజు నాయక్, జక్కు వెంకటస్వామి యాదవ్, ఇందారపు చెంద్రయ్య, అడ్వాల మహేష్,కేశారపు చెంద్రయ్య,బండి స్వామి,మెరుగు రాజయ్య,మేనం శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
Spread the love