ధాన్యం కొనుగోలు చేసి తరలించాలి

రైతు సంఘం నాయకుల డిమాండ్‌
నవతెలంగాణ-మహబూబాబాద్‌
దాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు వెంటనే తరలించాలని తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లపు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీరో లు మండల కేంద్రంలోని ఐకేపీ పీఏసీఎస్‌ సెంటర్లను తెలంగాణ రైతు సంఘం నాయకులు, రాష్ట్ర కమిటి సభ్యులు నల్లపు సుధాకర్‌, మహబూబాబాద్‌ జిల్లా నా యకులు మలేడి కోటయ్య సందర్శించి మాట్లాడారు. రైతులు సుమారు నెల పది హేను రోజులు కావస్తున్నా కానీ కొనుగోలు చేయడం లేదని కాంటాలు వేయడం లేదని కాంటాలు వేసిన ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తు న్నారని అన్నారు. మిల్లర్లు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు అష్ట కష్టాలు పడి అప్పులు చేసి పండించిన ధా న్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన గురవుతున్నారన్నారు. ఒకటి, రెం డు రోజుల్లో సెంటర్ల నుండి తరలింకచపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామ న్నారు. చిన్నవెంకయ్య, తగరం తిరుపతయ్య,మల్లు మోహన్‌రెడ్డి, లాకావత్‌ కిషన్‌, ఇస్లావత్‌ వీరన్న, కిషన్‌, బానోతు రమేష్‌, జిల్లేల్ల వెంకన్న మరికొందరు సెంటర్‌లో పోసి గేదెలు, కోతుల భయానికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి, అప్పుల బాధలను తట్టుకోలేక 1750 రూపాయలకు అమ్ముకుంటుంన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి కాంటా పెట్టిన రైతులు రామసాని ఉపేందర్‌, రామసాని నాగరాజు, రామసాని కిష్టయ్య, వంగాల వెంకన్న కు చెందిన ధాన్యాన్ని 15 రోజులక్రితం ఐకేపీ సీరోలు సెంటర్‌ నుండి ఒక్కలారి లోడు పెద్దవంగర రైస్‌ మిల్లుకు పంపిచ గా 12క్వింటాళ్ళ ధాన్యం అదనంగా పంపితేనే లోడు దిగుమతి చేసుకుంటామని రైస్‌ మిల్లర్‌ నాలుగు రోజులు సతాయించడం జరిగిందన్నారు. వ్యవసాయ అధికా రి, తహసీల్దారులకు రైతన్నలు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. మొలకెత్తి నా, తడిసినా పండిన ప్రతిగింజను కొంటామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఈకార్యక్రమంలో శామల బిక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డి, తగ రం చిన్నవెంకయ్య, దారావత్‌ వీరన్న, బానోతు వీరన్న,తేజావత్‌ గోపా, లాకావత్‌ రవి, బానోతు లక్ష్మణ్‌, తగరం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love