ఘనంగా గోలి శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు

– వేలాదిమంది అభిమానుల మధ్య కడ్తాల్‌ నుంచి కల్వకుర్తి వరకు కార్‌, బైక్‌ ర్యాలీ
– 2500 మంది మహిళలకు చీరలు పంపిణీ
– భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
– గోలికి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-ఆమనగల్‌
బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, జీఎస్‌ఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడ్తాల్‌ నుంచి మైసిగండి, ఆమనగల్‌, వెల్దండ మీదుగా కల్వకుర్తి వరకు భారీ కార్‌, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచ పేల్చి సందడి చేశారు. ర్యాలీలో జీఎస్‌ఆర్‌కు అనుకూల నినాదాలతో జాతీయ రహదారి అడుగడుగున హౌరెత్తింది. ర్యాలీలో గోలి శ్రీనివాస్‌ రెడ్డి ఓపెన్‌ టాప్‌ జీపు ఫై నిలబడి ప్రజలకు అబివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. కడ్తాల్‌, మైసిగండి, విఠాయిపల్లి, ఆమనగల్‌, వెల్దండ, కల్వకుర్తిలో పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. కడ్తాల్లో భారీ గజమాలను క్రేన్‌ సహాయంతో గోలి శ్రీనివాస్‌ రెడ్డికి వేసి అభిమానులు సన్మానించారు. మైసిగండి మైసమ్మ దేవాలయంలో శ్రీనివాస్‌ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాగాయిపల్లి వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, జడ్పీ వైస్‌ చైర్మెన్‌ బాలాజి సింగ్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ సత్యం, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల నేతలు, జీఎస్సార్‌ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నాయకులతో కలిసి గోలి శ్రీనివాస్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. దాదాపు 2500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోలి శ్రీనివాస్‌ రెడ్డికి మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌ రాజు, జనార్దన్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి, కాలేరు వెంకటేష్‌, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, వైయస్‌ఆర్‌ టీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చీమర్ల అర్జున్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ యాదిలాల్‌ తది తరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా చోట్ల జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, విజితా రెడ్డి, ఎంపీపీలు అనిత విజరు, కమ్లి మోత్యా నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, ఏఎంసీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, భూపతి రెడ్డి, జోగు వీరయ్య, సేవ్యా నాయక్‌, గుర్రం కేశవులు, సురమల్ల సుభాష్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, పత్య నాయక్‌, జహంగీర్‌, రజ్జాక్‌, సుమన్‌ నాయక్‌, రూపం వెంకట్‌ రెడ్డి, శంకర్‌ నాయక్‌, జైపాల్‌ రెడ్డి, వస్పుల జంగయ్య, గోరటి శ్రీను, రాజ శేఖర్‌, నాగులు నాయక్‌, తిరుపతయ్య, అహ్మద్‌, వెంకటయ్య, సంజీవ, స్వప్న, పంతు నాయక్‌, తులసి రామ్‌ నాయక్‌, సతీష్‌ , సాయినాథ్‌ రెడ్డి, అంజి, రమేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love