మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకే బస్తీబాట

– ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకెే బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు.ఆదివారం 22వ వార్డులో కౌన్సిలర్‌ సరితా యాదగిరి యాదవ్‌ ఆధ్వర్యంలో బస్తి బాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పాల్గొని కాలనీలో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ప్రధానంగా సమస్యలు కమ్మరి రామచంద్రయ్య ఇంటి నుండి కన్యకా పరమేశ్వరి గుడి వరకు, గుబ్బ శ్రీను ఇంటి నుండి రవి పంతులు ఇంటి వరకు సిసి రోడ్‌ ఏర్పాటు చేయాలని షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్‌ దృష్టికి కౌన్సిలర్‌ నడి కూడా సరిత యాదగిరి యాదవ్‌ తీసుకువచ్చారు. అదేవిధంగా బూర్గుల బాబు మియా ఇంటి నుంచి రోమియో రమేష్‌ ఇంటి వరకు, సాకలి నరసింహ డబ్బా నుంచి అంది పైలయ్య ఇంటి వరకు సిసి రోడ్డు వేసేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్‌ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కౌన్సిలర్లు జిటి శ్రీనివాస్‌, చెట్ల పావని నర్సింలు, జూపల్లి శంకర్‌, నాయకులు సలీం, నల్లమోని బిక్షపతి, విప్పరి నరేష్‌, చింతగొండపల్లి నర్సింలు యాదవ్‌, చిపిరి రవి, రఘునాథ్‌ యాదవ్‌, రోమియో రమేష్‌, జంగరాజ్‌, సంతోష్‌, అశోక్‌ యాదవ్‌, కాజా, వెంకటేష్‌ యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, సాకలి మహేందర్‌, ఆర్‌ఎంపీ డాక్టర్‌ శ్రీను పాల్గొన్నారు.

Spread the love