ఘనంగా బుద్ద జయంతి వేడుకలు..

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో గురువారం ఘనంగా బుద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్,అక్కల బాపు యాదవ్ మాట్లాడారు భారత దేశంలో బౌద్ధంను ముందుకు తీసుకుపోయినది సామ్రాట్ అశోకుడు అయితే ఆధునిక భారతంలో డాక్టర్ అంబేద్కర్ అని,ఆయన ఒక్క మాటతో 1956 విజయదశమి రోజున 5 లక్షల మందితో,మరునాడు మరో మూడు లక్షల మంది బౌద్ధంలోకి మారినారని చెప్పారు.భారత రాజ్యాంగం లోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంను డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం నుండే సేకరించినట్లు చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.బౌద్ధం శాంతిని బోధిస్తుంది.బౌద్ధం అహింస ను బోధిస్తుంది అందుకే ప్రపంచానికే భారత దేశం శాంతిని చెబుతుందన్నారు.ఈ కార్యక్రమం లో ప్రజాసంఘాల నాయకులు  దయ్యం పోచయ్య, ఉమేష్ రాజయ్య పాల్గొన్నారు.
Spread the love