ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-కీసర
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మున్సిపల్‌ కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు గుజ్జుక నర్మద పరశురామ్‌ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కుషాయిగూడ ఆర్టీసీ డిపో ఎస్సీ, ఎస్టీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, దళితరత్న గౌడ్‌ రవికిరణ్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గడ్డం శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో చట్టసభల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రతినిధి అని కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మొగిలిపాక వెంకటేష్‌, మేడ్చల్‌ జిల్లా మాల సంఘం నాయకులు గుజ్జుక పరశురామ్‌, దళిత నాయకులు నరసింహ, విష్ణు, అంబేద్కర్‌ అభ్యుదయ వాది పాడుగుల చంద్రమౌళి, మున్సిపల్‌ మైనారిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముబారక్‌, 2వ వార్డు మహిళా అధ్యక్షురాలు సులోచన, కాంగ్రెస్‌ నేతలు అహమద్‌,సమీర్‌, మహిళలు రేష్మ, రమణమ్మ, లక్ష్మి, కాలనీ వాసులు నాని, ఉదరు, బన్ని అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love