ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు జన్మదిన వేడుకలు 

నవతెలంగాణ – గోవిందరావుపేట

బీఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ సూడీ శ్రీనివాసరెడ్డి భారీ కేక్ తెప్పించి కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి నరసింహ నాయక్ లు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు లక్ష్మణ్ బాబు మరెన్నో జరుపుకోవాలని దేవుడు చల్లని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని పార్టీని విజయ పదంలో ముందుండి నడిపించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నాయకులు సభ్యులు అందరూ అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను అందరము ఐక్యంగా కృషి చేయాలని జన్మదిన కానుకగా గెలిపించి ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెలిశాల స్వరూప, మోహన్ రాథోడ్, పృథ్వీరాజ్ ఉట్ల, చుక్క గట్టయ్య, లకావత్ చందులాల్, తాటికొండ శ్రీనివాసాచారి, అక్కినపల్లి రమేష్, నామ్ పూర్ణచందర్, మాలోత్ గాంధీ, వి నరేందర్, కె నాగేశ్వరరావు, మువ్వ భాను పి గోపి, ఏ హనుమంతరావు, ఎస్ రవీందర్ రావు, అజ్మీర సురేష్, ఉట్ల మోహన్, జె రాంబాబు, డి సంజీవ, శ్రీనివాస్ రావు, కృష్ణారెడ్డి, అజయ్ గజ్జి, ఎలంధర్, సెంచు యాకోబ్ , పి విజయ్ కుమార్, బి కే దారి తదితరులు పాల్గొన్నారు.
Spread the love