
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలో గల మార్కండేయ ఆలయంలో అలాగే మండలంలోని మేనూరు గ్రామంలో గల మార్కండేయ ఆలయంలో సోమవారం నాడు శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు ఆయా గ్రామాల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవంగా జరుపుకున్నారు. మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భక్త మార్కండేయ జయంత్ ఉత్సవాల్లో మద్నూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్ ప్రత్యేకంగా పాల్గొన్నందుకు, మద్నూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారికి ఘనంగా శాలువతో సత్కరించారు. మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మహిళలు ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మేనూరు గ్రామంలో నిర్వహించిన మార్కండేయ జయంతి ఉత్సవాల్లో భజన కీర్తనలతో, అన్నదాన కార్యక్రమాలతో, ప్రత్యేక పూజలతో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి, కార్యక్రమాలు పండగ వాతావరణంగా ఘనంగా నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లో శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు సంఘం సభ్యులు మహిళలు ప్రత్యేకంగా పాల్గొన్నారు.