ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – చిన్నకోడూరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చిన్నకోడూరు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ శాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసిల్దార్ కార్యాలయం ముందు తహసిల్దార్ జయలక్ష్మీ జెండాను ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపిపి కూర మాణిక్య రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి కూర మాణిక్య రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది అని తెలిపారు. గ్రామ గ్రామన దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపిపి ఉపాధ్యక్షులు పాపయ్య, ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపిఓ సోమిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఉమెష్ చంద్ర, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యురాలు శారద, కో ఆప్షన్ మెంబర్ సాదక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love