ఘనంగా గోరింటాకు పండుగ

నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని విద్యానగర్ పార్కులో మహిళలు ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం రోజు గోరింటాకు పండుగ సందడి చేశారు. మహిళలంతా ఒకే చోట చేరి రోట్లో గోరింటాకు నూరి ఒకరికొకరు పెట్టుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తుమ్మల పద్మ, సంధ్యారాణి, గాయత్రి,  వీణ రెడ్డి, లీలావతి, గోవిందమ్మ, పద్మావతి, యాదమ్మ, రజిని, కవిత, రేణుక, నీలిమ, పద్మ, సత్యమ్మ, రాధా, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
Spread the love