ఘనంగా మే డే వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట

మే డే వేడుకలను మండల వ్యాప్తంగా బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు చలువాయి పసర దుంపెల్లి గూడెం తదితర గ్రామాలలో సీఐటీయూ గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో మేడే వేడుకలను సీఐటీయూ జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. పసర గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నేడే వేడుకలను నిర్వహించి జిల్లా కమిటీ నాయకులు పొదిల్ల చిట్టిబాబు మేడే విశిష్టతను వివరించారు. భవన నిర్మాణ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి సీఐటీయూ నాయకులు ఉపేంద్ర చారి కార్మికుల చట్టాలు ఎలా అనచి వేతకు గురవుతున్నాయో వివరించారు. సుందరయ్య నగర్ లో  పల్లపు వెంకన్న ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అధ్యక్షులు కడారి నాగరాజు గుడిసె వాసుల సమస్యలను ప్రస్తావించి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లేడి సందర్భంగా పలువురు విప్లవ గీతాలను ఆలపించి ఔరా అనిపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నాయకులు బి రెడ్డి సాంబశివ ఆదివాసి నాయకుడు గొంది రాజేష్  లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Spread the love