నవతెలంగాణ – తాడ్వాయి
మండల వ్యాప్తంగా కార్మిక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి, ఆశ, కేజీ కేస్ గ్రామపంచాయతీ కార్మికులు, గృహ నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రి కార్మికులు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిఐటియు జిల్లా కార్యదర్శి కురెందుల సమ్మక్క జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఊరు వాడ జెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్క కష్టజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతుందని మహోన్నతమైన విశ్వం మానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాల పునాది రాళ్లని తెలిపారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దుచేసి, హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు దిగ్గి చిరంజీవి, తెలంగాణ కలిగిన కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్, మాజీ సర్పంచ్ లు పులి పెద్ద నరసయ్య గౌడ్, నర్సింహా స్వామి, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి కాట నర్సింగరావు, అంగన్వాడి టీచర్స్ యూనియన్ కార్యదర్శి కురిందుల సమ్మక్క, సరిత, నాలి జయసుధ, ఎర్రోజు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పల్నాటి సత్యం, ముత్తినేని లక్ష్మయ్య, మాజీ ఎంపిటిసి దానక నరసింహారావు, కనుమల్ల శ్రీను, పాలకుర్తి రవీందర్, అమృత చారి, భయ్యా కుమార్, మహేశ్వర చారి, బొప్పారపు బాబురావు, యాకూబ్, కొంకతి సత్యం, పల్నాటి నర్సింహులు తదితరులు అంగన్వాడి, ఆశ, కల్లుగీత కార్మిక సంఘం, తాపీ మేస్త్రి సంఘం, గృహ నిర్మాణ సంఘం, గ్రామపంచాయతీ కార్మికులు, సిఐటియు తదితర కార్మికులు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతితులు పాల్గొన్నారు.