ఘనంగా పోషకాహార మసోత్సవాలు

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ ప్రైవేటు పాఠశాలలో బుధవారం పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సీనియర్ అంగన్వాడి టీచర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క మాట్లాడుతూ పోషకాహారం ప్రాముఖ్యత గురించి గర్భిణులకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా, ఎదుగుదలకు తోడ్పాటు ఉంటుందన్నారు. దీంతోపాటు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆమె సూచించారు. గర్భవతులు క్రమం తప్పకుండా ఐరన్‌ మాత్రలు అంగన్వాడీ సెంటర్‌లో ఇచ్చే పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరిత, నిర్మల, వెంకటలక్ష్మి, శ్రీకళ, జయమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love