- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉండడానికి గూడులేని నిరుపేదలకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తోందని మండలం రుద్రారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య తెలిపారు. శనివారం మంత్రి శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, హౌసింగ్ ఏఈ రజినీకాంత్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



