ఇంట్లోనే మొక్కలు పెంచండిలా…

చాలా మందికి మొక్కలు పెంచాలని అంత ఆసక్తి ఉన్నా, పెంచేందుకు స్థలం లేదని బాధపడి పోతుంటారు. అయితే అలా బాధపడే బదులు కాస్త ఆలోచించి చూస్తే… చక్కని ఆలోచనలతో చిన్న చిన్న జాగ్రత్తలతో మీ ఇంట్లో పచ్చదనాన్ని పరిచేయొచ్చు. అదెలాగంటే…
కొంత మందికి చిలుకలు, పిచుకలు పెంచుకునే అలవాటు ఉంటుంది. చిలుకల సంఖ్య పెరగడం వల్లనో ఏదైనా డామేజీ వల్లనో పక్కకు పడేసిన పంజరం ఉంటే దానిని మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగించుకో వచ్చు. ఒకవేళ లేకున్నా, పంజరం బయట మార్కెట్‌లో ఉంటాయి కొని తెచ్చుకోవచ్చు. దానికి నచ్చిన రంగుల్ని వేయాలి. అందులో పట్టే పరిమాణంలో గాజు లేదా పింగాణి పాత్రను ఎంచుకుని సారవంతమైన మట్టిని సేంద్రీయ ఎరువుతో కలిపి నింపాలి. ఆ పాత్రలో సోంపు, కొత్తిమీర, పుదీనా వంటివి మొక్కల కోసం విత్తనాలు నాటవచ్చు. దానిని ండి. చివరగా ఆ పంజరాన్ని ఎండతగిలే ప్రదేశంలో వేలాడదీస్తే సరి. చక్కని సువాసనతో పాటు వంటింటి అవసరాలు తీరతాయి. వీటికి బదులు తక్కువ ఎత్తులో పెరిగే పూల మొక్కల్నీ అందులో పెంచుకోవచ్చు. తీగజాతి రకాల్ని పెంచుకున్నా అందంగా కనిపిస్తాయి.
కొన్ని రకాల మొక్కలు కొద్దిపాటి ఎండ తగిలినా బతికేస్తాయి. అలాంటి మొక్కలతో పడకగదిలో పూల తోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు మాస్‌బాల్‌గా పిలిచే మట్టి ఉండల ద్వారా కావాలనుకున్న మొక్కల్ని గదిలోనే పెంచుకోవచ్చు. ముఖ్యంగా బోన్సారు మొక్కల్ని ఈ తరహాలో పెంచుకోవడం చాలా సులభం. కాకుంటే వీటిని కాస్తయినా ఎండ తగిలేలా కిటికీకి దగ్గర్లో వేలాడదీస్తే సరి. అందంతో పాటు ఆరోగ్యంగానూ ఎదుగుతాయి.
ఇక పోతే వీటికి నీళ్ల సంగతి ఎలా.. ఇల్లంతా ఇబ్బందికరంగా మారుతుందేమో అనే అనుమానం రావచ్చు. అలాంటి ఇబ్బందే ఉండదు. ఇందుకోసం మాస్‌బాల్‌ను ఉపయోగించవచ్చు. ఎలాగంటే… మాస్‌ బాల్‌ను ఓ పావుగంట పాటు నీటిలో నానబెడితే తర్వాత యథాస్థానంలో వేలా డదీస్తే సరిపోతుంది. ఇది వారానికొకసారి చేస్తే సరి. మొక్కలకు నీటి సమస్య ఉండదు.
వీటితో పాటు పాత గాజుపాత్రలు వాడనివి చాలానే ఉంటాయి. వాటిని గ్లాస్‌ పెయింటింగ్‌తో అందంగా మార్చుకోవచ్చు. ఆరిన తర్వాత దాన్ని ఉంచేందుకు అందమైన ప్లేట్‌ ఒకదాన్ని తీసుకుని అమర్చుకుని, వాటిల్లో లక్కీ బాంబూ లేదా యారో హెడ్‌ వంటి తీగజాతి మొక్కలను పెంచుకోవచ్చు.

Spread the love