నకిలీ విత్తనాలు సరఫరా చేసిన గ్రోమోర్

– గ్రోమోర్ షాప్ కు తాళం వేసిన రైతులు
– నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఆఫీస్ కు తాళం వేసి కార్యాలయం ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. విత్తనాల కంపెనీ రైతులకు అండగా నిల్వల్సింది పోయి, రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వకుండా కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే నాసిరకం విత్తనాలు రైతులను ఇచ్చి నట్టేట ముంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో బీర్కూరు మండలం లోని వివిధ గ్రామాలకు మన గ్రోమోర్ కంపెనీ నాసిరకం విత్తనాలు సరఫరా చేయడం తో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ అధికారులు వేసిన పంటలను పరిశీలించారు. దీనితో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. యాసంగీ సీజన్ పూర్తి అయిన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో నేడు బీర్కూరు మండలం కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి మన గ్రోమోర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేశారు. రైతులు గంగా కావేరి విత్తనాలు ఇవ్వాలని కోరగా మన గ్రోమోర్ బీర్కూర్ కంపెనీ, ఆర్కే సోనా కరీంనగర్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఈ ప్రాంత రైతులకు ఎదురు దెబ్బ తగిలింది. వేసిన పంటకు తెగుళ్ల బారినపడి దిగుబడులు తగ్గిపోవడంతో, అన్నదాత శాస్త్రవేత్తలను సంప్రదించారు, వారం రోజుల క్రితం జగిత్యాల్, రుద్రూర్, కరీంనగర్, ప్రాంతాలకు చెందిన వరి విత్తన శాస్త్రవేత్తలు ఈ పంటలను పరిశీలించారు. పంటలు పూర్తిగా దిగుబడుల తగ్గిపోవడంతో రైతులు తమకు పరిహారం చెల్లించాలంటూ వారం రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం దక్కపోవడంతో, నేడు బీర్కూర్ రైతులు కలిసి మన గ్రోమోర్ ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ పంటలు దెబ్బ తినడానికి నకిలీ విత్తనాలు ఇచ్చిన మన గ్రోమోర్స్ కంపెనీ తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రైతులకు తో చర్చించి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన మన గ్రోమోర్ కంపెనీ యజమాన్యం రైతులతో చర్చలకు రాకపోవడంతో రైతులు మన గ్రోమోర్ కంపెనీ వద్ద నిరసనకు దిగారు. తమకు పరిహారం ఇచ్చేవరకు తమ ఆందోళన విరమించేదే లేదంటూ రైతులు భీష్మించుకొని కూర్చున్నాను. రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వకుండా ఇతర ఇతర కంపెనీలకు చెందిన విత్తనాలు సరఫరా చేయడం వాతావరణం భూమి లో మార్పులు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయని బాన్సువాడ డివిజన్ వ్యవసాయ అధికారి స్వామి తెలిపారు. విత్తనాలు సరఫరాలో నాసిరకమని తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Spread the love