– జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్
నవతెలంగాణ- నాగోల్
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అత్యుత్తమ జియో సైన్స్ ఆర్గనైజేషన్ అని జిఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ అన్నారు. 2023 సెప్టెంబర్ 18 నుండి 2024 ఏప్రిల్ 12 వరకు 7 నెలల పాటు 84 మందితో ప్రారంభమైన 47వ బ్యాచ్ భూ వైజ్ఞానిక శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. నాగోలు డివిజన్‌లోని బండ్లగూడలో గల భారతీయ భూవైజ్ఞానిక సర్వే శిక్షణా సంస్థ (జి.యస్.ఐ.టి.ఐ.) యొక్క ఎం ఎస్ కష్ణన్ ఆడిటోరియంలో యూనియన్ కమిషన్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబడిన 47వ కొత్త బ్యాచ్‌కి చెందిన 84 మంది భూవైజ్ఞానిక శాస్త్రవేత్తల యొక్క ఓరియంటేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ ప్రసాద్ మాట్లాడుతూ దేశాభివద్ధికి దోహదపడే క్రిటికల్, స్ట్రాటజిక్ ఖనిజ నిక్షేపాల అన్వేషణకు 47వ కొత్త బ్యాచ్ జియలగిస్టు తమ నైపుణ్యాన్ని వినియోగించి వంతు కషి చేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. డాక్టర్ మాథ్యూ జోసెఫ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ మిషన్-వీ మాట్లాడుతూ 7నెలల పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని క్రమశిక్షణ, అంకితభావంతో విద్యార్థి దశ నుంచి ప్రొఫెషనల్ జియోలజిస్ట్‌గా విజయవంతంగా పూర్తి చేసిన అధికారులందరినీ అభినందించారు. తర్వాత శ్రీ శ్యామ ప్రసాద్ భూటియా, డైరెక్టర్ హైదరాబాద్ కోర్సు యొక్క పూర్తి వివరాలను అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన ట్రైనీ అధికారులందరికీ డైరెక్టర్ జనరల్, డిడిజి అండ్ హెడ్, మి-వీ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.మాథ్యూ జోసెఫ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ మిషన్-5 డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, డైరెక్టర్లు, అధ్యాపకులు, శిక్షణా సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.