విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్: హారీష్ రావు

 

నవతెలంగాణ -హైదరాబాద్: ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని అన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందన్నారు. ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామన్నారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు.

Spread the love