కరీంనగర్‌ గెలుపు కోసం ‘హస్తం’ ఆపరేషన్‌ ఆకర్ష్‌..

'Hastam' operation Akarsh for the victory of Karimnagar..– విపక్ష కీలక నేతలతో హైకమాండ్‌ మంతనాలు
– ఏ క్షణాన్నైనా గోడదూకే చాన్స్‌!
– బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఉద్దండులే.!
– ఆ ఇద్దరినీ ఢకొీట్టేందుకు మాస్టర్‌ప్లాన్‌ : వలసొచ్చే వారి కోసం కదుపుతున్న పావులు
– మానకొండూర్‌లో ఫస్ట్‌ వికెట్‌
– ‘కమలం’ పార్టీకి గుడ్‌బై చెప్పి ‘హస్తం’ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గెలిచేందుకు ‘హస్తం’ పార్టీ పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీల నుంచి వలసలకు గేట్లు తెరిచిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని కీలక నేతలను కలుపుకునేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. బరిలో నిలిచిన విపక్ష పార్టీల అభ్యర్థులిద్దరూ ఉద్దండులే కావడంతో వారిని ఢకొీట్టే మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగానే కరీంనగర్‌ గులాబీ కీలక నేతలతో మంతనాలు మొదలయ్యాయనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. రెన్నెళ్లుగా పార్టీ నేతల అరెస్టులు, వారిపై పెరుగుతున్న కేసుల నడుమ అధికార పార్టీలో చేరితే తప్ప మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందనే ఒత్తిళ్లు బీఆర్‌ఎస్‌ కీలక నేతలపై పెరిగినట్టు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. కరీంనగర్‌ సీటు మాత్రం పెండింగ్‌లో పెట్టింది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పని చేసి, తరువాత ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ ప్రస్తుతం హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేస్తున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయగల పొన్నం స్థాయి నాయకుడు కరువయ్యాడు. పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల్దిరూ ఉద్దండులే కావడంతో వారిని ఢకొీట్టేందుకు సరితూగే అభ్యర్థితోపాటు పార్టీ బలాన్ని పెంచే పనిలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ పడింది. అందులో భాగంగానే కరీంనగర్‌ పార్లమెంట్‌పై దృష్టిసారించినట్టు కనిపిస్తోంది.
విపక్ష నేతలతో మంతనాలు..
కరీంనగర్‌ పార్లమెంట్‌ పధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం మానకొండూర్‌, చొప్పదండి, వేములవాడ, హుస్నాబాద్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండగా.. సిరిసిల్ల, కరీంనగర్‌, హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మినV0ä మిగిలిన ఇద్దరినీ కాంగ్రెస్‌లో చేర్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ నేతపైనే ఫోకస్‌ పెట్టిన ‘హస్తం’ హైకమాండ్‌ రహస్యంగానే మంతనాలు జరుపుతూ ఆయన్ను అష్టదిగ్బంధనం చేస్తోందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. భూకబ్జా కేసుల్లో రిమాండ్‌ అవుతున్న స్థానిక సంస్థల నేతల్లో ఆయన అనుచరులూ ఉండటంతో అధికార పార్టీలో చేరాలనే ఒత్తిళ్లు ఎమ్మెల్యేపై ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కీలక నేతలుగా పేరుగాంచిన వారే కాంగ్రెస్‌లో చేరుతుండగా.. కరీంనగర్‌ ఎమ్మెల్యే పార్టీ మారడం పెద్ద విషయం కాదనే చర్చ కూడా సాగుతోంది. అయితే ప్రస్తుతం హుస్నాబాద్‌ నుంచి గెలిచి మంత్రిగా ఉన్న పొన్నం కరీంనగర్‌లో తిరిగి తన పట్టు నిలుపుకునే పనిలో పడ్డారు. తనకు పోటీగా గంగుల కమలాకర్‌ రాకను ఆయన తిరస్కరించే అవకాశాలూ లేకపోలేదు. మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పార్టీ మారే వ్యక్తుల్లో ముందువరుసలో ఉంటారనే చర్చ మొదట్లోనే వచ్చింది. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ప్రాణం ఉన్నంత వరకూ కేసీఆర్‌ వెంటే ఉంటానని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ మారుతున్న పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వీరిరువురే గాకుండా బీఆర్‌ఎస్‌లోని స్థానిక సంస్థల కీలక నేతలపైనా కాంగ్రెస్‌ దృష్టిసారింది.
విపక్షసభ్యులిద్దరూ ఉద్దండులే!
కరీంనగర్‌ లోక్‌సభ పోరులో బీఆర్‌ఎస్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌, బీజేపి బండి సంజరు ఇద్దరూ ఉద్దండులేనని చెప్పొచ్చు. సుదీర్ఘ రాజకీయానుభవం, ఈ స్థానం నుంచే ఎంపీగా పని చేసిన అనుభవం సహా తమతమ పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగారనే చెప్పొచ్చు. ప్రస్తుతం బరిలో ఫైనల్‌ అయిన వారిద్దరినీ ఢకొీట్టేందుకు కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది.
అందుకు బలమైన రాజకీయపునాదులున్న అభ్యర్థి కరువడంతో విపక్ష పార్టీలను బలహీనపరిచే పనిలో కాంగ్రెస్‌ పడింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ కేడర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే పనిని వేగిరం చేసింది. ఇప్పటికే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్థానిక సంస్థల నేతల్లో పదుల సంఖ్యలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మానకొండూర్‌ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసి.. తిరిగి తన మాతృపార్టీ కాంగ్రెస్‌లో చేరారు.

Spread the love