పరువు పోయిందని మనస్తాపం చెంది ఆత్మహత్య..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తన పరువు పోయిందని మనస్తాపం చెంది పాఠశాల అవరణ లో ఉన్న ఒక చెట్టుకు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వరద రాత్రి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలకు ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన మచ్చ ప్రవీణ్ కుమార్ (43) అదే గ్రామానికి చెందిన మల్లు బాయి మృతిని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను అందరి ముందు బూతు పురాణంతో తిట్టడంతో, గొడవ పెట్టుకోవడంతో మృతుడు తన పరువు పోయిందని మనస్థాపానికి గురై అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతిని భార్య మచ్చ  శివరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురికి తరలించినట్లు ఎస్సై వివరించారు. మచ్చ ప్రవీణ్ కుమార్ మృతికి కారణమైన మల్లు బాయి ని మంగళవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
Spread the love