అంగన్ వాడిలో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ తోట పెంపకం..

– క్లస్టర్ సూపర్ వైజర్ వినోదా

నవతెలంగాణ – జుక్కల్
పోషణ  అభియాన్ లో ప్రపంచ పర్యవరణ  దినోత్సవం సూచనల అనుసారం  అంగన్ కేంద్రాలలో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ పెంపకం చేపట్టాలని క్లస్టర్ సూపర్ వైజర్ వినోదా అన్నారు. బుదువారం నాడు సూపర్ వైజర్ వినోదా మాట్లాడుతూ.. ప్రపంచ పర్యవరణ  దినోత్సవం జూన్ 5న నిర్వహిస్తామన్నారు. పర్యవరణం   కోసం ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవం ధీమ్ పునరుద్దరణ, ఎడారీకరణ,  కరువు, స్థితిస్థాపక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సీడ్ బాల్స్ తయారీ, కంపోస్ట్ తయారీ, పర్యవరణం మండలాలలో కాపాడుతామని ప్రతిఙ్ఞ చేయాలని కార్యచరణ  చేసామని తెలిపారు.  కేమ్రాజ్ కల్లాలీ తాండాలోని మేాడల్ అంగన్ వాడి కేంద్రం సందర్శించారు. ఈ సంధర్భంగా కేంద్రంలోని ఖాలీ స్థలంలో కూరగాయల పెంపకం చేపట్టాలని టీచర్ రాదా ను ఆదేశించారు. స్వయంగా కూరగాయలు పండించడం వలన రసాయన ఎరువులు వాడకుండా సెంద్రియ ఎరువులు వాడాలని, అవసరం అనుకుంటే స్థానిక వ్వవసాయాదికారుల సూచచనలు తీసుకోవాలని తెలిపారు. తాజా కూరగాయల పెంపకంకో ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన కూరగాయలతో వంటలు వండి కేంద్రంనకు వచ్చే పిల్లలకు, గర్భిణిలకు, బాలీంతలకు అంద చేయడం వలన మంచి పోషక విలువలు కల్గిన రసాయనాలు కలవ కుండా శుద్దంగా అందించవచ్చని పేర్కోన్నారు. అదేవిధంగా కూరగాయల సంభందించిన విత్తనాలను కేంద్రం నిర్వహకురాలు రాదాకు అందించారు. పిల్లలకు అందిస్తున్న పోషక ఆహరం బాలమృతం  పంపిణిి అడిగి తెలుసుకున్నారు. పోషక విలువలు తక్కువగా ఉన్న గుర్తించిన పిల్లలకు ప్రత్యేకంగా పోషక ఆహరం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వినోదా, అంగన్ టీచర్ రాదా, తదితరులు పాల్గోన్నారు.
Spread the love