హృదయ పరిష్వంగన

హృదయ పరిష్వంగనబ్రతుకు యుద్ధంలో అదో సంధి కాలం
పూర్వపు గాయాల తాలూకు జ్ఞాపకాల
పచ్చి పుండ్లు అసంకల్పితంగానే
సలుపుతూ వేధిస్తున్న అనిశ్చితి బందీ కాలం
శబ్దిస్తున్న హదయానికి స్వేచ్ఛ వుందో లేదో
తెల్వనట్టి తెలుసుకోలేనట్టి
అపసవ్య ఆపసోపాల కాలం
కాలం వీచిన గాలికి నేను కొట్టుకు పోయానో
నేను పోతున్న వైపే గాలి వీచిందో ..
ఏ సంకల్పమో.. ఏ దఢ నిశ్చయమో
నా నావను ఇటు తిప్పేసిన ఒకానొక శుభ సూచిక
ఎన్ని అద్భుత దశ్యాలను ఆవిష్కరించిందో
అలజడుల గుండె చప్పుళ్ల మధ్య పదసడుల ఆర్తి ధ్వనుల మధ్య
అక్షరాలను వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ …
కదులుతున్న నేనొక మది తలపును
పుస్తక పువ్వుల పరిమళాలు వీస్తున్న
సంపెంగల సందర్భ కాలం అది
అవ్యాజ్య ప్రేమ పదతోరణాల నడుమ
ఓ కవనం పవనమై తాకిన స్పర్శ
ఎంత వెచ్చని సోయగమో..
ప్రేమైక చిహ్నమైన తాజ్‌ మహాల్‌లా
గుత్తులుగా పూసిన గుల్‌ మొహార్‌ పువ్వుల్లా
భావాలు గట్టిగా కమ్మేసుకున్న గాఢ అనుభూతి
ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండు …
అమేయంగా అమోఘంగా లోలోపల హదయ పరిష్వంగన
– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

Spread the love