కశ్మీర్‌ జీ-20 సదస్సుకు భారీ భద్రత

నవతెలంగాణ – కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్‌ఎస్‌జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్‌ సరస్సులో ప్రత్యేక డ్రిల్‌ నిర్వహించారు. మరోవైపు సదస్సును మోదీ ప్రభుత్వం హైజాక్‌ చేసిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు. సదస్సును పార్టీ కార్యక్రమంలా మార్చారని, జీ-20 లోగోను బీజేపీ పార్టీ గుర్తు కమలంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. జీ-20 సదస్సు లక్ష్యంగా 26/11 తరహా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందటంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.

Spread the love