నేటి నుంచి జీ-20 సదస్సు

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. జీ-20 సమావేశాలకు భారత్‌ ప్రాతినిధ్యం గర్వించదగిన విషయమని చెప్పారు. 3వ హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతాయని వివరించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్‌ వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కొత్త రకాల వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నదని తెలిపారు. సమావేశాలకు 180 మంది సభ్యులు, 10 ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, 22 అంతర్జాతీయ సంస్థలు హాజరవుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో పీఐబీ ఢిల్లీ ఏడీజీ డాక్టర్‌ మనీషా వర్మ, పీఐబీ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ పాల్గొన్నారు.

Spread the love