ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన హేమంత్ సోరెన్

నవతెలంగాణ – హైదరాబాద్: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జార్ఖండ్ హైకోర్టు తన పిటిషన్‌పై ఫిబ్రవరిలోనే విచారణ పూర్తి చేసినప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హేమంత్ సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కపిల్ సిబల్ వాదనలు వినిపించగా, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరారు. దీన్ని ఏప్రిల్ 26న విచారించాలని కపిల్ సిబల్ కోర్టును కోరగా, జస్టిస్ ఖన్నా, ‘తాను ఏమీ చెప్పడం లేదు. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ తేదీని తెలియజేస్తార ‘ని పేర్కొన్నారు.

Spread the love