రేపు నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

నవతెలంగాణ – అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 25) తన సొంత నియోజకవర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Spread the love