తెలుగు రాష్టాల్లో మొదలైన నామినేషన్ల పర్వం..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. ఏపీలోని ఒంగోలు లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు (టీడీపీ), విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి భాజపా తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు.
తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ (భాజపా), భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి (భాజపా) నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు.

 

Spread the love