- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా 3వ రోజు పర్యాటక వారోత్సవాలు కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి కౌలాస్ కోట వరకు నిర్వహించిన 2కే హెరిటేజ్ వాక్ బుధవారం విజయవంతమైంది. కార్యక్రమంలో జుక్కల్ మండల కేంద్రం నుంచి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గురించి గ్రామాలలో హెరిటేజ్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమములో జిల్లా యూత్ క్రీడల అధికారి వెంకటేశ్ గౌడ్, అథ్లెకిట్స్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ అనితా సింగ్, ఎంపీఓ , గ్రామ పెద్దలు యువత, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- Advertisement -



