యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్
నవతెలంగాణ-మిడ్జిల్
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని ఎన్నికలలో హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలపై పెను భారం మోపిందని యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇంధన ధరల భారం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు.
పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేదల నడ్డి విరగ్గొడుతోందని తీవ్రంగా విమర్శిచారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్యుడి జీవితం భారంగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.



