విద్యకు అధిక ప్రాధాన్యత

– సింగరేణి సహకారంతో పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తా
– ఎమ్మెల్యే మట్ట రాగమాయి దయానంద్‌
నవతెలంగాణ-వేంసూరు
ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని దీనికి నిదర్శనం పాఠశాలలు పునర్‌ ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించటం దేశంలోనే మొదటిసారి అని ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్‌ అన్నారు. శుక్రవారం మండలం కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మర్లపాడు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ దాతలు సహకారంతో మరికొన్నిటిని విద్యార్థులకు అందించే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జాయిన్‌ అయ్యేందుకు కృషిచేసిన పాఠశాల సిబ్బందిని అభినందించారు. విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు గుర్తింపుతేవాలన్నారు. ప్రభుత్వ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పనకు తన నిధుల నుండి కోటిన్నర మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రమేష్‌, ఎంఈఓ సిహెచ్‌ వెంకటేశ్వరరావు, డీటీ కరుణ శ్రీ, మండల పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్‌ రెడ్డి, సోమిరెడ్డి వెల్ది జగన్మోహన్రావు, బొమ్మన బోయిన వెంకటేశ్వరరావు, గన్నేని సురేష్‌, ఫక్రుద్దీన్‌, జంగా శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రాఘవరెడ్డి, రేగళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సుధాకర్‌ రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Spread the love