కాగజ్‌నగర్‌లో హైటెన్షన్…బీఆర్ఎస్, బీఎస్పీ ఘర్షణ

నవతెలంగాణ కాగజ్‌నగర్‌: కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో బీఎస్పీ, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ
ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌లోని విజయ బస్తీలో ఆదివారం బీఎస్పీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండగా.. అక్కడికి భారీ శబ్దాలతో బీఆర్ఎస్ ప్రచార వాహనం వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. పాటల శబ్దం తగ్గించాలని కోరినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టించుకోలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ కాగజ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Spread the love